
0

0
1
ఈవీ రంగంలో ఫోర్డ్ మోటార్స్ భారీగా పెట్టుబడులు
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన మన దేశంలో అమెరికన్ కంపెనీలు రాణించలేక పోతున్నాయి. ఇక్కడి ప్రజల నాడిని పట్టుకోవడంలో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు వైఫల్యం చెందుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం అమెరికా బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, ఇటీవల భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్ ఆటో దిగ్గజం అమెరికాలో మూడు బ్యాటరీ కర్మాగారాలు, ఒక అసెంబ్లీ ప్లాంట్ను నిర్మించడానికి దక్షిణ కొరియా సంస్థ ఎస్కె ఇన్నోవేషన్ కోతో చేతులు కలిపినట్లు ప్రకటించింది.

0

0
1



