logo
logo
Products 

TDP MLA Nandamuri Balakrishna Slaps Photographer At Hindupur

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
1
TDP MLA Nandamuri Balakrishna Slaps Photographer At Hindupur

మరోసారి చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. తన అనుమతి లేకుండా వీడియో తీసినందుకు  ఓ ఫోటో గ్రాఫర్‌పై చేయి చేసుకున్నారు. ఈ ఘటన హిందూపురంలో శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా హిందూపురంలోని 9 వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలయ్య ప్రచారం చేస్తుండగా అక్కడే ఉన్న ఒక ఫోటో గ్రాఫర్‌ వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలయ్య.. అతనిపై చేయి చేసుకున్నారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్‌ చేయ్‌ అని మండిపడ్డారు. మరోవైపు బాలయ్య కోపాన్ని చూసిన టీడీపీ శ్రేణులంతా హడలెత్తిపోయారు.

 

కాగా గత మూడు రోజులుగా హిందూపురంలో బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన మొదటిరోజు కూడా టీడీపీ నేతలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో బాలయ్య హావభావాలు చూసి టీడీపీ నేతలతో పాటు పక్కనే ఉన్న జనాలు నవ్వారు. అందరూ నవ్వడంతో బాలయ్య సీరియస్‌ అయ్యారు. ఇక మూడోరోజు రోడ్‌‌ షోకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అక్కడున్న నాయకులపై బాలయ్య అసహనానికి గురయ్యారు. 

చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు

ఏయ్‌.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య  

 

 
 
 
Read latest Politics News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram
collect
0
collect
0
collect
1
avatar
seosmsakshi