

న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతడి ప్రతిభను కొనియాడుతూ మాజీ దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనితో పోలిక తెస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఇషాన్‌ను ప్రశంసించాడు. ఈ మేరకు.. ‘‘జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువ కీపర్ బ్యాట్స్‌మెన్ తన సామర్థ్యమేమిటో నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది(ధోనిని ఉద్దేశించి). ఏమాత్రం బెదురు లేకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతగానో నచ్చింది’’ అని ట్వీట్ చేశాడు. కాగా మాజీ సారథి, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధోని స్వస్థలం జార్ఖండ్ అన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు ఆడుతున్నాడు. దాంతో ధోని-ఇషాన్‌లకు పోలిక తెచ్చాఉడ సెహ్వాగ్.
చదవండి: చాలా మంది చేయలేనిది పంత్ చేసి చూపించాడు..
చెలరేగిన ఇషాన్ కిషన్ గెలిపించిన కోహ్లి





