
అంతెత్తు లేచింది.. వెంటపడి తరిమింది..!

Sloth Bear Chases Away Tiger Video Goes Viral, న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram