
Chris Gayle Stormed The Abu Dhabi T10 League | 84* off 22 balls | Sakshi Cricket News
యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.40 ఏళ్ల వయసులోనూ మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా సునామీ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ 22 బంతుల్లోనే 9 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.